కొత్త కథ 2017

Kotta Katha 2017
04 May

అక్కిరాజు భట్టిప్రోలు – తొంభయ్యవ దశకంలో సెంట్రల్ యూనివర్సిటీ రోజుల్నుండీ పరిచయం, అటుతర్వాతి అమెరికా రోజుల్లో తనతో మంచి స్నేహం. తను కుప్పిలి పద్మ గారితో కలిసి సంకలనం చేసిన “కొత్త à°•à°¥ 2017” చదివాను. చదివాను అనడం కంటే, ఏకబిగిన చదివాను అనడం కరెక్టు. కొత్త à°•à°¥ 2017 లోని కథల గురించి, నా అభిప్రాయం:

బ్రదర్ ఆఫ్ బంగారి – అక్కిరాజు భట్టిప్రోలు: సమకాలీన యువతుల ఆలోచనారీతిని కళ్ళకు కట్టినట్టుగా చూపించే à°•à°¥. లక్ష్మి పాత్ర ద్వారా Good Decision, Bad Execution అన్నదాన్ని సోదాహరణంగా చెప్పినట్లుగా నాకనిపించింది.

మెలకువ ముందు à°•à°² – అరిపిరాల సత్య ప్రసాద్: రియలిజానికీ, సర్రియలిజానికీ మధ్యగా నడుస్తూ పోయిన à°•à°¥. ఎర్రదనం, మట్టి సింబాలిగ్గా కలసిన కలలాంటి à°•à°¥.

à°’à°• జీవితం… రెండు కలలు… – ఆకునూరి హాసన్: ప్రేమంటే సున్నితత్వమా లేదా భయపెట్టేంతలా వెల్లువెత్తే భావావేశమా అని ఆలోచింపచేసే à°•à°¥. రూప నుండి రజనీగంధ వరకూ వ్యర్ధమయిన రెండు దశాబ్దాల్లో అతను సున్నితత్వమంటే ఏమిటో తెలుసుకున్నాడని నాకనిపించింది – అతను పాప పక్కన కూర్చున్నప్పుడు.

నల్లగాలి – భగవంతం: à°’à°• మామూలు దినచర్య సందర్భానుసారంగా ఎలాంటి అనుభూతుల్ని కలిగిస్తుందో చెప్పే à°•à°¥. à°•à°¥ ఆఖర్లో అతడు బైక్ మీద కాక ఆటోలోనో కాబ్‌లోనో వెళ్ళుంటే ఇంకా బాగుండుననిపించింది.

ఇద్దరు మంచివాళ్ళ అడల్ట్ à°•à°¥ – జి. ఎస్. రామ్మోహన్: పాతికేళ్ళనుండి సాఫ్ట్‌వేర్ ఫీల్డులో ఉన్నా కొంచెం మింగుడుపడని (read మోడర్న్) సందర్భాల à°•à°¥. సుధాకర్ని చూసి గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలేరుతున్నాడేమిటిరా అనిపించిన à°•à°¥.

ఛోటి – హనీఫ్: చూపుడు వేలుకింద బొటనవేలుని పెట్టి బొటనవేలుని పైకెగరేసిన అమ్మని అర్ధం చేసుకోలేని అమ్మ à°•à°¥ మనసుని కొంచెం మెలిపెట్టింది.

ఫ్రెనర్ లా విదా – కొల్లూరి సోమశేఖర్: మెటీరియలిస్టిక్ పనుల మొగుడికి, ఈస్థటిక్ భావాల పెళ్ళానికీ మధ్య నిలిచిన సాక్షి చెప్పిన మనసు à°•à°¥.

వాటర్ ఫ్రంట్ – కుప్పిలి పద్మ: ఐడియాలజీయా, ప్రాక్టికాలిటీయా అన్న ప్రశ్న వచ్చినప్పుడు? మనం ఏది ఫాలో అవుదాం, మన పక్కోడు ఏది ఫాలో అయితే బాగుంటుంది అన్న మీమాంస వచ్చినప్పుడు? పొలిటికల్ కరెక్ట్‌నెస్ ప్రాముఖ్యతను గురించి ఆలోచింపచేసిన à°•à°¥.

వెలుతురు నీడలు – కాకుమాని శ్రీనివాసరావు: హిస్టరీ రిపీట్స్ అనిపించిన à°•à°¥. ఆతడి ఫాసినేషన్ కేవలం à°† వస్త్రధారణ పైనేనా అనికూడా అనిపించింది.

క్రీ.పూ-క్రీ.à°¶. – కోడూరి విజయ కుమార్: రాచరికపుకాలంనాటి కథతో వర్తమానకాలంలోని పరిస్థితులపై సునిశిత వ్యంగ్యాస్త్రం. కాకుల సంభాషణ పెదాలపై చిరునవ్వు తెప్పించింది.

తోలుబొమ్మలాట – కూనపరాజు కుమార్: మారుతున్న సామాజిక అలవాట్ల నైపధ్యంలో అంతరించిపోతున్న కళల, అలమటించిపోతున్న కళాకారుల à°•à°¥. మనలోని నిస్సహాయతను నిశ్శబ్దంగా నిలదీసే à°•à°¥.

చున్నీ – కె. వి. కరుణకుమార్: మనచుట్టూ జరుగుతున్న సంఘటనలతో మనసును మెలితిప్పిన à°•à°¥. అవును కదూ అనిపిస్తుంది.

పెన్సిల్ బాక్స్ – మహమ్మద్ ఖదీర్ బాబు: à°’à°• చిన్న సంఘటన కొన్ని జీవితాల్ని ఇంతలా మార్చేస్తుందా అనిపించే à°•à°¥. విశ్వనాథ్ గారు తీసిన ఆపద్భాంధవుడు గుర్తొచ్చింది.

కృష్ణ శోధ – మోహిత: భావుకత ఎక్కువగా ఉన్న చక్కని పద్యకావ్యంలో à°•à°¥ à°† వృక్షాల్లోనూ, పొదల్లోనూ, లతల్లోనూ గిరికీలు కొడుతూ ఉండిపోయింది. వారాలపై ప్రయోగాలు బావున్నాయి – శనివారాలకే ఏదో తేడాకొట్టింది రెండుసార్లూ.

à°¦ డెడ్ మాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్ – మహి బెజవాడ: ముగ్గురి జీవితాల్లోని నాలుగో మనిషి జీవితపు కాలిన కలలు. ముగ్గురికీ మూడు రకాలుగా కనిపించిన మనిషిలోని అంతర్గత శూన్యపు ఆఖరి అడుగు à°ˆ à°•à°¥.

సున్నాలు – మెర్సీ మార్గరెట్: కహానీ-2 సినిమా చూడకపోవటం వల్లనేమో, à°† వెన్నాడుతున్న సున్నాల గురించి అర్ధం కాలేదు. చైల్ద్ అబ్యూస్ పైన à°’à°• నిజాయితీ అయిన à°•à°¥.

మట్టి గోడలు – నాగేంద్ర కాశీ: భూసేకరణ బాధితుల జీవితాల్లోని చీకటి కోణాల à°•à°¥. మట్టిని ప్రేమించేవాడి మనస్తత్వాని గురించి బాగా రాసారు.

శ్రీమతి సర్టిఫికేట్ – పూడూరి రాజిరెడ్డి: కామాలే తప్ప ఫుల్లుస్టాపుల్లేని ఒకానొక ఉదయపు బిజీ జీవితంలోంచి ఊడిపడ్డ చురుక్కు హాస్యం. గది à°Žà°‚à°¤ పెద్దదో ఊడ్చినప్పుడే తెలుస్తుందనేలా…

వికృతి – రాధిక: అడాలిసెంట్ వయసులోని మనసు పోకడల చిత్రీకరణ. బాహ్య సౌందర్యానికీ అంతర్గత సౌందర్యానికీ సంబంధం లేదని తెలుసుకున్న మనిషి మనసు à°•à°¥ యిది.

UNKNOWN – సురేష్: భయానక, భీభత్స రసప్రధానంగా సాగిన థ్రిల్లర్. పాత్రలన్నీ మనకు తెలిసిన unknown లే అవటంవల్ల సంభాషణలు ఫాలో అవడానికి కొంచెం కష్టపడాలి.

కొన్న తల్లి – సింహాద్రి నాగశిరీష: చీకటి బతుకుల్లోని గొలుసుకట్టును ఎవరో ఒకరు తెంపినప్పుడు వచ్చిన వెలుగు రేఖ.

స్కూపీ – శాంతిశ్రీ: భావోద్వేగాలను శోషించే దారులు మూసుకుపోయిన చిన్నారి ఆక్రోశానికి ముగింపు ఏమిటి. చిన్ని కుటుంబాల్లోని మానసిక కల్లోలాలని చూపించిన à°•à°¥.

à°“ హెన్రీ స్టోరీ – వెంకట్ సిద్దార్థ: మన కళ్ళెదురుగా మూగప్రేమలను చూడటం à°† ప్రేమించడం కన్నా కష్టమేమో అనిపించే à°•à°¥.

చివరాఖరి ముచ్చట్లు - కొత్తకథ 2017 లో నాకు నచ్చిన వాక్యాలలో కొన్ని:

  • బ్రదర్ ఆఫ్ బంగారి – “రాత్రి సంసారానికి ఆనవాళ్ళు లేవని నమ్మకం కలిగాక”
  • à°’à°• జీవితం… రెండు కలలు… – “కళ్ళతో నవ్విన రజనీగంధని పెదవులతో నవ్వి పలకరించి”
  • చున్నీ – “శరీరానికి ముఖం ఉంటేనే మచ్చ”, “అందుకే ఆమె చున్నీని రీఇన్వెంట్ చేసింది”
  • కృష్ణ శోధ – “ఆలస్యమయితేనేం, అమృతం అయినప్పుడు”
  • మట్టి గోడలు – “à°“ పక్షం రోజులు అల్లరైనా గానీ ప్రజాస్వామ్యమే గెలిచింది. ప్రజలు ఓడిపోయారు”

మొత్తమ్మీద కొత్తకథ – 2017 à°’à°• మంచి కథాసంకలనం. మనం కొనడానికి వెచ్చించిన మూల్యానికీ, చదవడానికి వెచ్చించిన సమయానికీ కూడా న్యాయం జరుగుతుంది.

కొసమెరుపు: కొత్తకథ-2017 లోని కుప్పిలి పద్మగారి వాటర్ ఫ్రంట్ కథకు ఒకటో అధ్యాయమే ఉంది, రెండవది లేదు. అప్పటికే పదిహేడు పేజీల కథ అయింది. బాహుబలి సినిమాను విభజించిన ప్రేరణతో రెండో అధ్యాయం కొత్తకథ-2018 లో రాస్తారేమో.

చికెను వింగ్సూ, అల్లప్పచ్చడి

21 Apr

అల్లప్పచ్చడి (అల్లం పచ్చడి) వాడకంలో నేను అసలు సిసలు తెలుగు వాడిని. అల్లప్పచ్చడి అంటే హోటళ్ళలొ తెల్ల చట్నీతో పాటు ఇచ్చే ఎర్ర చట్నీ అనుకునేరు. నేను చెప్పేది మామూలుగా మనం సంవత్సరానికోసారి పట్టుకునే అల్లప్పచ్చడి గురించి. ఆ గట్టి అల్లప్పచ్చడిలో కొద్దిగా మంచినీళ్ళు గానీ, పెరుగు గానీ కలిపి ఎలాంటి ఫలహారాల్లోనయినా నంజుకుని తినే విషయంలో నేను అసలు సిసలు తెలుగువాడినన్నమాట. మనలో మనమాట, ఇడ్లీల్లోనూ దోశల్లోనూ అల్లప్పచ్చడి భేషుగ్గా ఉంటుంది. పెసరట్టు ఉప్మాలో అయితే మరీ భేషుగ్గా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల పక్కన తెనాలి రామలింగడు ఉన్నప్పటి మజానే పెసరట్టు ఉప్మా పక్కన అల్లప్పచ్చడి ఉన్నప్పుడు వస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.

గతవారంలో ఒకరోజు సాయంత్రం అత్యవసర పనులన్నీ చక్కబెట్టుకుని (ఆఫీసు మెయిల్సు, స్వంత మెయిల్సు, ఫేసుబుక్కూ, ట్విట్టరూ వగయిరాలు చక్కబెట్టుకుని అన్నమాట) కొంచెం ఫలహారం తినే పనిలో పడ్డాను. ఎదురుగా మాంచి పసందుగా క్రిస్పీ చికెను వింగ్సు కనిపించాయి. వాటితోపాటు నంజుకోవటానికి సహజ సిద్దమయిన బార్బీక్యూ సాసు కూడా ఉంది. కానీ తిండి విషయంలో ప్రయోగాలు చెయ్యకపోతే మనం మనమెందుకవుతాము. అటూ ఇటూ చూసి ఎదురుగా కనపడ్డ అల్లప్పచ్చడిని మనదయిన రీతిలో పలచగా (ఇంచుమించుగా బార్బీక్యూ సాసులా కనపడేలా) కలిపాను. సోఫాలో చేరగిలబడి కాళ్ళు టేబులుపై పెట్టుకుని టీవీ చూస్తూ ఫలహారానికి ఉపక్రమించాను. అల్లప్పచ్చడిలో à°’à°• చికెను వింగుని బాగా తిప్పి నోట్లో పెట్టుకోగానే అప్రయత్నంగా “మహాప్రభో” అనిపించింది.

à°ˆ “మహాప్రభో” వెనుక à°’à°• విషయం ఉంది. శుభసంకల్పం సినిమాలో రాయుడు పాత్ర వేసిన కళాతపస్వి విశ్వనాధ్ గారు à°’à°• సన్నివేశంలో దాసు (కమల హాసన్) చేసిన చేపల పులుసు రుచి గురించి చెబుతూ “మహాప్రభో” అంటాడు. à°† సినిమా చూసినప్పటినుండీ ఏ తిండి పదార్ధం చాలా బాగున్నా నాకు మహాప్రభో అనిపిస్తుంది.

అలా మహాప్రభో అనిపింపచేసిన చికెను వింగ్సూ అల్లప్పచ్చడి కాంబినేషను ఫలహారం క్షణాల్లో ఖాళీ అయిపోయిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. మీకుగనక ఇలాంటి ప్రయోగాలు ఇష్టమయితే మీరు కూడా ప్రయత్నించండి.

బాపు

01 Sep

బాపు: చిన్నప్పుడు ఆయన గీతలు ఆయన్ను మొదటిసారి పరిచయం చేసాయి. క్లుప్తంగా విషయాన్ని చెప్పడమనేదానికి ఆయన గీతలు నిలువెత్తు ఉదాహరణలు. మనం ఈనాడు గొప్పగా చెప్పుకునే minimalist design ను ఆయన ఎప్పుడో గీసి చూపించారు. సంస్కృతావిష్కృతులైన ప్రబంధనాయికలకు బాపు బొమ్మలు సరియైన తెలుగుసేతలు.
ఆయన సినిమాలు రేడియోలో వినడం చిన్ననాటి మరపురాని అనుభూతుల్లో ఒకటి. ముత్యాలముగ్గు, మంత్రిగారి వియ్యంకుడు, భక్త కన్నప్ప, పెళ్ళి పుస్తకం, వంశ వృక్షం, రాజాధిరాజు, మనవూరి పాండవులు లాంటి సినిమాలు వినోదాన్నివ్వటంతోపాటు మానవ, సామాజిక సంబంధాలను తార్కిక, మానవీయ దృక్కోణాలలో ఎలా చూడాలో చూపించాయి. ఆయన తీసిన సంపూర్ణ రామాయణం ఒక మహాకావ్యాన్ని మూడు గంటల్లోకి సంక్షిప్తం చేసిన దృశ్య కావ్యం.
బంగారానికి తావి అబ్బటమనేదానికి బాపూరమణలు ఒక మంచి ఉదాహరణ. సాక్షి వ్యాసాలనుంచి కోతికొమ్మచ్చి వరకూ వాళ్ళు అల్లిన పడుగుపేకలు తెలుగు పాఠకులకి వాళ్ళిచ్చిన పట్టువస్త్రాలు.
బాపు ఇక లేరనగానే మొదట స్ఫురించింది ఈయన రమణగారి దగ్గరకు వెళ్ళారని. విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలలోలా ఈయన వెళ్ళి ఆయనను తీసుకొని వస్తే ఎంత బాగుణ్ణు?

ఉగాది శుభాకాంక్షలు

11 Apr

అందరికీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతీ రోజూ తెలుగు చదువుదాం. తెలుగు చదివిద్దాం.

Ugaadi

పై ఫొటోలో ఉన్నవి ఈ రోజు చదవడానికి సిద్ధంగా ఉన్న పత్రికలు, పంచాంగం.

తెలుగోడి నమ్మకం

10 Apr

[ ఇది యధార్ధ సంఘటన. కల్పితం కాదు. ]
à°ˆ రోజు ఉదయం సుమారు అయిదు à°—à°‚à°Ÿà°² సమయం. సంజీవరెడ్డి నగర్ నుండి అమీర్‌పేట్ మీదుగా సైకిలు తొక్కుకుంటూ వెళుతున్నాను. వంటిపై నీలం, తెలుపు రంగులు కలిసిన జెర్సి, తలపై రెఫ్లెక్టివ్ హెల్మెట్, చేతికి పాడెడ్ గ్లవ్‌లు, కాలికి ట్రయినింగ్ బూట్లు, వెరసి విశ్వనాథ సత్యన్నారాయణగారి వ్యాకరణబద్ధమయిన వాక్యాలలా ఉంది నా సైకిలు తొక్కే వేషధారణ. విద్యుత్తు వాడకం తగ్గించే ప్రణాళికలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిగారికి సహాయపడుతూ వీధి దీపాలు అంతకు కొన్ని నిముషాలకు ముందే ఆరిపోయాయి. నా సైకిలుకి ఉన్న ఎల్ఈడీ లైట్లు, దారిన పోయే వాహనాల హెడ్‌లైట్లు తప్ప రోడ్డు అంతా చీకటిగా ఉంది. అలాంటి సమయంలో ఒకానొక విషయం వల్ల రోడ్డు పక్కన ఆగి ఎవరితోనో మాట్లాడుతుండగా à°’à°• ఆటోవాలా నా పక్కన ఆగాడు. నాతో “వాడ్డూయూ వాంట్” అంటూ ఇంగ్లీషులో సంభాషించే ప్రయత్నం మొదలెట్టాడు. à°’à°• రెండు మూడు వాక్యాల ఇంగ్లీషు సంభాషణా ప్రయత్నం తరువాత నాకు అర్ధమయిందేమిటంటే వాడు నేను తెలుగువాడిని కాదని అనుకుంటున్నాడు. సైకిలు తొక్కుతూ హెల్మెట్ వగైరాలు పెట్టుకునేవాడు తెలుగోడు (కొండొకచో భారతీయుడు) అయి ఉండడని వాడి గట్టి నమ్మకం అయి ఉంటుంది. à°† తరువాత వాడితో తెలుగులో మాట్లాడడం మొదలెట్టాను. అప్పటికి కూడా వాడు నావంక అపనమ్మకంతో చూడడం మానలేదు. ఆఖరుకు వాడితో హైద్రాబాదీ హిందీలో మాట్లాడిన తరువాత నేను తెలుగోడిననే నమ్మకం వాడికి కలిగి వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు.

తెలుగు

29 Aug

ఈ రోజు మాతృభాషాదినోత్సవము. ఈ సందర్భంగా నేను చిన్నప్పుడు విన్న ఒక లలితగీతంలోని చరణంనుండి ఒక చిన్ని వాక్యం. ఈ పాటను దూరదర్శన్-హైదరాబాదు వారి లలితసంగీతం కార్యక్రమంలో సుమారు పాతికేళ్ళ క్రితం విని వ్రాసుకొన్నాను. ఆ పాట ఇప్పటికీ గుర్తుండిపోయింది.

 

 

నా వికస హృదయ కమలాసనమున నీవే కొలువయితే
నా వినుత జీవ పాత్రికలోన నీ ప్రేమ నింపితే
పదములు నీవే ఇమ్ము
నీవే పాడే సుస్వరమిమ్ము

తెలుగు చదువుదాము. తెలుగులో మాట్లాడుదాము.

డాక్టరు పెప్పరూ, జెమినీ పళ్ళపొడీ, ఉపమాలంకారమూ

05 Apr

అమెరికాలో కోక్ తరువాత నేను ఎక్కువగా ఇష్టపడేది డాక్టర్ పెప్పర్. సుమారు పదిహేనేళ్ళ క్రితం మొదటిసారి డాక్టర్ పెప్పర్ తాగినపుడు మనసెటో వెళ్ళిపోయింది. వేరేరకం వెళ్ళిపోవడం అనుకునేరు సుమా, అప్పటికే నాకు పెళ్ళయిపోయింది. నాలుకమీది చిల్డ్ డాక్టర్ పెప్పర్ బిందువులు చిన్నప్పటి పల్లెటూరి ఉదయాలను గుర్తు చేసాయి. ఎడమచేతిలో పళ్ళపొడిని వేసుకొని, కుడిచేతిలోని టూత్‌బ్రష్‌ని చల్లని నూతినీళ్ళలో ముంచి, దానికి నెమ్మదిగా పళ్ళపొడి అద్ది నోట్లొ పెట్టుకున్న ఫీలింగ్ కలిగింది డాక్టర్ పెప్పర్ నోట్లోకి వెళ్ళగానే. ఇప్పటికీ డాక్టర్ పెప్పర్ తాగుతున్నపుడు చిన్నప్పుడు మిస్సయిన పళ్ళపొడి తినడాన్ని ఇప్పుడు భర్తీ చేసినట్లనిపిస్తుంది.

మేము రెండు రకాల పళ్ళపొడి వాడేవాళ్ళం – అందరికీ తెలిసిన కాల్గేట్ ఒకటయితే కొందరికి మాత్రమే తెలిసిన జెమినీ పళ్ళపొడి రెండవది. జెమినీ పళ్ళపొడి పాకెట్ మీద బూరాలు ఊదుతున్న ఇద్దరు అబ్బాయిల బొమ్మలుండేవి. అందువల్ల నాకూ, మా తమ్ముడికీ జెమినీ ఎక్కువ నచ్చేది. అంతేగాక జెమినీ పళ్ళపొడిలో మంచి లవంగం రుచి ఉండేది. à°† కారణంగా నాకు డాక్టర్ పెప్పర్ రుచి కాల్గేట్ కన్నా జెమినీ పళ్ళపొడికి దగ్గరగా అనిపిస్తుంది. జెమినీ పళ్ళపొడిని మాటిమాటికీ గుర్తుకు తెస్తున్న డాక్టర్ పెప్పర్ à°•à°¿ ధన్యవాదాలు.

తోక కొమ్మచ్చి ఆడిన ముళ్ళపూడి అనూరాధ

11 Feb

à°ˆ వారం స్వాతి వారపత్రికలో ముళ్ళపూడి అనూరాధగారి తోక కొమ్మచ్చి à°’à°• అనుకోని ఆహ్లాదం (టెల్గూలో ప్లెజంట్ సర్ప్రయిజు అన్నమాట.) పూర్వీకుల ప్రస్తావనలు మెండుగా ఉన్న కోతికొమ్మచ్చిలో  అనువంశీకుల ప్రస్తావనలు అస్సలు లేవు – రమణగారి ఉద్దేశపూర్వకంగానేనేమో. అనూరాధగారు తెలుగు సరిగా రాదంటూనే తెలుగువారి కలికితురాయి రాతలని మళ్ళీ గుర్తుచేసారు. కోతులతోటలో తోకలెక్కువగా ఉండటంవల్ల కొన్ని పేరాలు మళ్ళీ మళ్ళీ చదివి సంబంధబాంధవ్యాలను  అర్ధంచేసుకోవలసి వచ్చింది. పునఃపఠనం ఆహ్లాదానందకారకం.

మొదటి సంపాదన చెక్కుని ఎక్కువడబ్బులకి ఎక్స్ఛేంజీ తీసుకుందామనుకున్న తండ్రీ, సర్టిఫికేట్లను ఫొటోలు కట్టించి షీల్డులపక్కన పెట్టిన తండ్రీ కలిసి గుండెను తడిపారు. స్నేహితుడికి కూరలు తీసిఉంచడాలూ, డ్రైవరు సమయానికి భోంచేయలేదని అలగడాలూ మానవసంబంధాల మునుపటి కోణాలు. గోల్డ్స్‌కి పుట్టిన కూతురు గోల్డ్‌స్పాట్ కావటం డార్విన్‌ని అబ్బురపరచగల ప్రకృతిసిధ్ధ పరిణామం.

సందర్భానుసారంగా ఉన్న బాపు పొదుపుగీతలు రాతల భావాన్ని ఇనుమడింపజేసాయి. పాదాలు చూసి ఫ్లాటయ్యి పారాణి గీయడం, గాడిద చెవులు, కషాయం గరాటు, లేడీసు పాలిటిక్సు వగైరాలు దేనికవే.

తెలుగూస్ అయిఉండికూడా తెలుగులో వ్రాసిన అనూరాధగారికి ధన్యవాదాలు. మా మంచి కోతులకి మహమంచి తోకలు…

నిరాహార కార్తీకమా?

23 Oct

అమ్ములపొదిలోని అస్త్రాలని ఒక్కటొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు మన దొరవారూ, ఆచార్యులవారూను. ఇక మిగిలింది నిరాహారాస్త్రమే.

తెగేదాకా లాగకూడదని మనవాళ్ళకి కొంచెం ఆలస్యంగా తెలివయింది. ఆసరికే కార్మికులూ, రవాణా ఉద్యోగులూ, విద్యార్ధులూ, మిగతా ఉద్యోగులూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడం మొదలెట్టారు. మూడు రోజుల రైలు రోకో జ్ఞానోదయ ప్రసాదిని అయింది. మన పోలీసులయితే మనవాళ్ళే కదా అని కొంచెం మెత్తగానే ఉంటారు కానీ రైల్వే పోలీసులు బిగిస్తే మన కొవ్వు కరిగి కండ నలుగుతుంది.

ఏసీ రూముల్లో కూర్చుని రైలు రోకోని పర్యవేక్షించగల మనవాళ్ళకి బస్సులులేక ఆటోలల్లొ నలుగుతున్న ప్రజల నాడిని తెలుసుకోవడం కొంచెం కష్టమయింది. సమ్మెలో రాళ్ళు విసిరేవాళ్ళకి బిర్యానీ పేకెట్లు ఇవ్వగలరేమోకానీ ఇంట్లోని పొయ్యిలో పిల్లి లేవక పిల్లలు పస్తులున్నపుడు ఆసరా కాలేరుకదా. సకలజనులకి ఒళ్ళు మండి సమ్మె వికలమయ్యిందందుకే.

రాజీనామాస్త్రం మొన్న మొన్నటిదాకా ప్రత్యర్ధులకు భయం కలిగించినా, మొన్నటి ఉప ఎన్నికవల్ల ఆ అస్త్రం వికటించిందన్న ఆందోళన కూడా మొదలయింది.

ఇక మిగిలింది నిరాహారాస్త్రం. వాడి రెండేళ్ళయిన ఈ అస్త్రానికి ఇంకా వాడి బాగానే ఉండి ఉంటుంది. కార్తీకమాస ఉపవాసాలకి పుణ్యం కూడా వస్తుంది. మన పిచ్చుకదొరవారు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెడతారేమో చూద్దాం.

Sri Rama Rajyam Telugu Audio Review

10 Sep

గత వారం రోజులకు పైగా కారులో శ్రీ రామ రాజ్యం పాటలు వింటున్నాను. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే ఈ పాటల గురించి నా మాటల్లో:

  • జగదానందకారకా: బాలు, శ్రేయాఘోషల్ పాడిన à°ˆ పాట శ్రీరాముని అయోధ్యాగమనాన్ని కళ్ళకు కట్టినట్ట్లు చూపిస్తుంది. ఈనాటి మన తెలుగు చిత్రాలలొ ‘కర్టెన్ రైజర్’ (డిస్నీ వారి లయన్ కింగ్ లో సర్కిల్ ఆఫ్ లైఫ్ వంటివి) పాటలు చాలా అరుదు. అలాంటి అరుదయిన à°ˆ పాట విన్నకొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. “రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే…” అన్న భావం బాగుంది. “రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం” అంటున్నప్పుడు బాలు స్వరం ముమ్మాటికీ అమృతమే. లవకుశలోని “జయ జయ రామ”, “రామన్న రాముడు, కోదండ రాముడు, శ్రీరామచంద్రుడు వచ్చాడురా, సీతమ్మ తల్లితో వచ్చాడురా” అన్న పాటల్లోని భావాల సంగమం à°ˆ పాట.
  • ఎవడున్నాడీ లోకంలో: à°ˆ బాలు పాటలో చంద్రమోహన్ మాటలుకూడా ఉన్నాయి. శ్రీరాముని గుణగణాలను కీర్తించే à°ˆ నిముషమున్నర పాట వినదగ్గది.
  • సీతారామ చరితం: అనిత, కీర్తనల గళాలతోని à°ˆ పాటలొ వనవాసంనుండి అగ్నిప్రవేశం వరకూ à°•à°² ఘట్టాలు ఉన్నాయి. ఆరున్నర నిముషాల à°ˆ పాటలో పదాల కూర్పు (తక్కువ పదాలలో ఎక్కువ సన్నివేశాలుండేలా) చాలా బాగుంది. లవకుశలోని “శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా” పాటవంటిదే ఇది.
  • శ్రీరామా లేరా à°“ రామా, ఇలలో పెనుచీకటి మాపగ à°°à°¾: శ్రేయాఘోషల్, రాము పాడిన à°ˆ పాటలో ఇళయరాజా ఆధునిక వాయిద్యాలు వాడడంతో కొంచెం వింతగా మొదలవుతుంది. కాని కొద్దిసేపట్లోనే గాత్రం వాయిద్యాలను అధిగమించి మనల్ని కట్టిపడేష్తుంది. రెండో చరణం నుండి à°ˆ పాట సీతారాముల అనురాగాన్ని, అనుబంధాన్ని చూపుతుంది. మచ్చుకి కొన్ని పదాలు: “హరికే హరిచందన బంధనమా”, “శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం”
  • దేవుళ్ళే మెచ్చింది: క్రితం జన్మలో చిత్ర, శ్రేయాఘోషల్ కవలపిల్లలై ఉండాలి. మొదట à°ˆ పాట వింటున్నప్పుడు ఎవరి గొంతు ఎక్కడ పాడిందో కనిపెట్టాలని చాలా వృథాప్రయత్నాలు చేసాను. తరువాత à°† ప్రయత్నాలు కట్టిపెట్టి à°ˆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. “శివథనువదిగో, నవవధువిదిగో”, పాట రాసిన జొన్నవిత్తులగారూ, మా అభినందనలివిగో.  à°ˆ పాటలో శ్రీరామ జననం నుండి సీతారామ కళ్యాణం వరకూ ఉన్న ఘట్టాలు వస్తాయి. à°ˆ పాటలోని తెలుగు పదాల ఉఛ్ఛారణ వర్థమాన గాయకులకు నిఘంటువులా పనికొస్తుంది.
  • గాలీ, నింగీ, నీరూ, భూమీ, నిప్పూ మీరూ: లవకుశలోని “ఏ నిమిషానికి ఏమి జరుగునో” లో ఘంటసాల గొంతు ఆవేదనను చూపిస్తే, à°ˆ పాటలో బాలు గొంతు ఆక్రోశాన్ని చూపించింది. పంచభూతాలూ వద్దనలేదేమని అడుగుతూ మొదలెట్టిన à°ˆ పాటలో బాలు గళవిశ్వరూపం వినిపిస్తుంది. హెచ్చు తగ్గు స్వరాల మధ్యలో గుండెల్ని పెట్టి పిండడం ఆయనకో మంచి అలవాటు. మనకో మంచి అనుభూతి. à°ˆ పదాల్ని ఆయన పాడిన తీరు అత్యద్భుతం – “రారే మునులూ ఋషులూ, ఏమైరీ వేదాంతులూ”, “సెలయేరూ సరయూ నదీ”, “రామా, వద్దనలేదా”, “విధినైనాకానీ ఎదిరించేవాడే, విధిలేక నేడూ, విలపించినాడే”, “à°ˆ రక్కసి విధికీ చిక్కిందా”.
  • రామాయణము, శ్రీ రామాయణము: “వినుడు వినుడు రామాయణ గాథ” కు నేటి సేత à°ˆ పాట. చిత్ర, శ్రేయాఘోషల్ à°ˆ పాట పాడారు. చాలా బాగుంది.
  • సీతా సీమంతం: శ్రేయాఘోషల్ పాడిన à°ˆ పాట రెండు వేర్వేరు స్థాయిల్లో వస్తుంది. రెండురకాలుగానూ à°ˆ పాట బాగుంది.
  • రామ రామ రామ అనే రాజమందిరం: శ్వేత, అనిత పాడిన à°ˆ పాట బాలరాముని చేష్టల్ని గురించి లవకుశులు చెబుతున్నట్టుగా ఉంటుంది. మనకు చిరపరిచయమైన అద్దంలో చందమామతో పాటు భవిష్యత్తుకి సంకేతంగా కోతుల్ని, ఉడతల్ని, ఎంగిలి పళ్ళని చేర్చారు. సరదాగా చాలాసార్లు వినదగ్గ పాట ఇది.
  • కలయా నిజమా: ఆంజనేయుని వేదనను చూపించే à°ˆ పాటను టిప్పు పాడారు.
  • ఇది పట్టాభిరాముని ఏనుగురా: కోలాటం పాట వరుసలో ఉన్న à°ˆ పాటను శ్వేత పాడారు. à°ˆ పాటలో మన à°’à°• తెలుగు మాండలీకం ఛాయ బాగా కనపడుతుంది. à°ˆ పాటను ఎడిట్ చేసినవాళ్ళు ఇంకో విడి పాట (ఇదే బాణీకి ఇదే శ్వేత పాడిన) “శంఖు చక్రాలు పోలిన కూనలారా” ను కత్తిరించడం మర్చిపోయారు. రెండు పాటలూ మరల మరలా వినదగ్గవి. కూనిరాగం తీయదగ్గవి.
  • సప్తాశ్వరథమారూఢం: బాలు పాడిన మంగళ శ్లోకం ఇది.
  • మంగళము రామునకు: అనిత, కీర్తన పాడిన మంగళ గీతం ఇది.

క్లుప్తంగా చెప్పాలంటే – ఇళయరాజా సుస్వరాల పాటలు. బాలు వగైరాల గొంతుల్లోంచి మన గుండెల్లోకి వచ్చే పాటలు. రమణ మనమధ్య లేనప్పటికీ, తన ప్రభావం పుష్కలంగా ఉన్న పాటలు. బాపు మార్కు పాటలు. మన తెలుగువాళ్ళం కొని వినవలసిన పాటలివి. జయ శ్రీరామ.