శాలిని గారి పెళ్ళి కార్డు

22 Jun

శాలినిగారి పెళ్ళి కార్డు చూడముచ్చటగా ఉంది. నా చిన్నపట్నుంచీ చూసిన పర్సనల్ కార్డుల్లో ఇంత క్లుప్తంగా, హృద్యంగా విషయాన్ని చెప్పిన కార్డులు చాలా అరుదు. అచ్చ తెలుగులో ఇంత బాగా చెప్పిన కార్డులు లేనే లేవు.

కవరు మీద ఒకపక్క సింపుల్‌గా “నా పెళ్ళి”. అవతలిపక్క చిన్నారి సీగానపెసూనాంబ. తన బ్యాక్‌గ్రౌండులో చల్లని చంద్రుడూ, చిన్ని పిల్ల మేఘం. అడుగుపక్క చిన్ని చిన్ని డోలూసన్నాయిల తోరణం.

లోపలి కార్డు మీద ఎడమపక్క చిన్ని ఫ్లేప్ మీద సుముహూర్తం, వేదిక వగైరా వివరాలు ( బాపు ఫాంట్ లో అని చెప్పక్కర్లేదుగా ). కుడిపక్క పేజీలో నడుమ్మీద చేతులుపెట్టుకుని బుడుగు. వాడిపక్క “ఆశ్విన్‌తో” అని అసలు విషయం. వాడివంక చూపిస్తూ మురిపెంగా తలదించుకున్న సీగానపెసూనాంబ పక్కన “శాలిని”.

శాలినిగారు అసలైన విందు కార్డులోనే ఇచ్చేసారు.

 

SAlinigAri peLLi kArDu chUDamuchcaTagA undi. nA chinnapaTnunchI chUsina parsanal kArDullO imta kluptamgA, hRdyamgA viSHayAnni cheppina kArDulu chAlA arudu. achca telugulO imta bAgA cheppina kArDulu lEnE lEvu.

kavaru mIda okapakka simpul^gA “nA peLLi”. avatalipakka chinnAri sIgAnapesUnAmba. tana byAk^groumDulO challani chamdruDU, chinni pilla mEgham. aDugupakka chinni chinni DOlUsannAyila tOraNam.

lOpali kArDu mIda eDamapakka chinni flEp mIda sumuhUrtam, vEdika vagairA vivarAlu ( bApu fAmT lO ani cheppakkarlEdugA ). kuDipakka pEjIlO naDummIda chEtulupeTTukuni buDugu. vADipakka “ASvin^tO” ani asalu viShayam. vADivamka chUpistU muripemgA taladimcukunna sIgAnapesUnAmba pakkana “SAlini”.

SAlinigAru asalaina vimdu kArDulOnE ichchEsAru.

బంగారు హీరోలు

27 May

మన్మధుడు సినిమాలో నాగార్జున తన చిన్నాన్న తనికెళ్ళ భరణి తో ఉక్రోషంగా “మరి ఆడాళ్ళ చీరల షాపుల్లో సేల్స్ à°•à°¿ మగాళ్ళు ఎందుకుంటారు?” అని అంటాడు. à°† సన్నివేశంలో అది జోక్‌గా అనిపించినా నిజజీవితంలో అది à°’à°• యధార్ధం. మన తెలుగు హీరోలు à°ˆ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. బంగారం షాపులకి, బంగారు ఆభరణాలకి ఇంకా బంగారు ఋణాలకి అడ్వర్టయిజ్ చేయడానికి మన తెలుగు హీరోలకి ఉన్న డిమాండు హీరోయిన్లకు లేకుండా పోయింది. నాగార్జున, వెంకటేష్, ఎన్టీయార్, జగపతిబాబు వంటి హీరోలు బంగారానికి సింగారాలు తీసుకొస్తున్నారు. వెరీ ఇంటరెస్టింగ్!

సీమలూ, టపాకాయలూ…

04 May

దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమన్నట్లుంది ఒకానొక తెలంగాణా జే. ఏ. సీ. వ్యవహారం (ఒకానొక అని ఎందుకన్నానంటే ప్రస్తుతం ఎవరు ఏ జే. ఏ. సీ. తరఫున మాట్లాడుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి.) సదరు జే. ఏ. సీ. వారు “సీమ టపాకాయ్” అన్న సినిమా టైటిల్లో సీమ అన్న పదం ఉంది కాబట్టి à°† సినిమాను తెలంగాణాలో బహిష్కరిస్తామంటున్నారు. రతనాల సీమ రాయలసీమకు “సీమ” అనే పొడి వ్యవహారికం కేవలం ఈమధ్య ప్రాచుర్యం పొందింది. అసలు ‘సీమ” అనే తెలుగు పదం విశేషణంగా వాడినపుడు “విదేశీ” అన్న భావాన్ని స్ఫురింపచేయడానికి వాడతారు. సీమ టపాకాయ్ అంటే విదేశీ పద్ధతిలో తయారయిన (అది ఇక్కడే తయారవచ్చు – మన “సీమ సరుకు” ఐ. à°Žà°‚. ఎఫ్. ఎల్. లాగ) టపాకాయ్ అనుకోవాలి గానీ ఇదేంటో మరి.

 

కూనిరాగాలు: రేవులోని తాడిచెట్టులా

13 Apr

మిస్టర్ పెర్‌ఫెక్ట్ లోని “రేవులోని తాడిచెట్టులా, నీ ఎక్కువేమిటో” అన్నపాట ప్రస్తుతం పదేపదే మనసులో మెదులుతోంది. మరీ à°…à°‚à°¤ వైవిధ్యమున్న ట్యూన్ కాకపోయినప్పటికీ గాత్రంవల్ల ఈపాట వినసొంపుగా అనిపిస్తోంది.

Mullapudi Venkata Ramana

24 Feb

It is heavy on my heart to know that Mullapudi Venkata Ramana is no more. Right from my childhood, I have strong admiration towards his writings: from the classic Budugu to most recent Kothi Kommacchi. His Telugu translations of books like Around the world in 80 days are among my first taste of English Fiction. His vital contributions to unforgettable movies like Bhakta Kannappa, Mooga Manasulu, Sampoorna Ramayanam, Saakshi, Mutyala Muggu, Manavoori Paandavulu and Pelli Pustakam make lasting impression on viewers. Whenever I watch any of these movies, the (story/dialogue/screenplay) writer really stands out with simplicity yet strong impact. May his soul rest in Peace and hope Bapu can cope up with this.

మార్పు: అలా మిగిలింది

07 Feb

ఒక ప్రభంజనంలా, ఒక అలలా మొదలైన మార్పు ఒక నీటి తుంపరలా మారింది. ఒక ప్రక్షాళన కోసం మొదలైనటువంటి ఆ అల ఈనాడు మన చర్మంపై ఉప్పు నీటి తుంపరలా వాలి, తడియారి, క్షారాన్ని మిగిల్చింది. తనుకూడా పెద్దసముద్రంలోని చిన్ని వంతునన్న నిజాన్ని నేడు నిక్కచ్చిగా చెప్పింది. ఇంకోలా మొదలైంది. అలా మిగిలింది.

ఆ కథలు అయిపోయాయి

12 Aug

à°ˆ రోజుతో స్వాతి వారపత్రికలో వంశీ వ్రాస్తున్న “మా దిగువ గోదారి కథలు” అయిపోయాయి. ఆఖరి ముద్ద కొద్దిగా పెద్దది పెట్టినట్టు కృష్ణలీల గురించి కొంచెం ఎక్కువే వ్రాసాడు. బాపు ఇంకో బొమ్మ ఎక్కువే గీసాడు. ప్రతీ వారం ఉత్సుకతో చదివించిన సగటు గోదారొడ్డు పాత్రలకు (సారీ, జీవితాలకు) ప్రస్తుతానికి సెలవ్!

ఉగాది

16 Mar

క్రితం ఉగాదికి:

అనుకున్నది నిర్భయంగా చేసే రాజశేఖరుడు ఉన్నాడు.
అవతలివాళ్ళని చేయమని తను రాజీనామా చేయని కోదండం లేడు.
నాలుగ్గోడల మధ్యా ఉత్తుత్తి (సెలైన్)  దీక్షలను చూసి మోసపోయిన విద్యార్ధుల (ఆత్మ)  హత్యల్లేవు.
వసుధైకకుటుంబంలా అవుతున్న లోకంలో మనవాడినే ఆడిపోసుకునే విభజనల్లేవు.

ఈ ఉగాదికి:
ప్రపంచ విపణిలో పైకెగబాకుతున్న మనదేశానికి  మన రాష్ట్రం నుంచి తగిన ప్రాతినిథ్యం ఉంటుందని ఆశిస్తూ  ఉగాది శుభాకాంక్షలు.

శోభారాజు గారి ఇంటర్వ్యూ

28 Nov

à°ˆ రోజు సాయంత్రం à°’à°• తెలుగు న్యూస్ ఛానెల్ లో శోభారాజు గారి ఇంటర్వ్యూ వచ్చింది. (మీరు తికమక పడితే:  శోభారాజు గారు ఒకప్పుడు తి.తి.దే. ఆస్థాన గాయకురాలు. “అదివో అల్లదివో” అన్న అన్నమాచార్య కీర్తన తో మొదలయ్యే ఆల్బం ఆవిడ గొంతులోంచి జాలువారిందే.)  ఆన్నమాచార్య కీర్తనలను స్వరపరచడంపై ప్రత్యేకం à°—à°¾ సాగిన à°ˆ ఇంటర్వ్యూ చాలా బాగుంది. మనకు సుపరిచితమైన మరియు అపరిచితమైన కొన్ని కీర్తనలు, వాటి వైవిధ్య స్వరాలు చాలా బాగా పాడారు.  ఆ  ఇంటర్వ్యూ అయిన తరువాత “సిరుత నవ్వులవాడు సిన్నెక్క” కీర్తన మళ్ళీ వినాలనిపించింది. విన్నాను.

నూకలన్నం

07 Nov

ఈ రోజు కొంచెం బద్దకంగా నిద్ర లేచాను. ప్రొద్దున్నే ఒక గంట ఇంటిదగ్గర గడపాలనిపించింది. దానికి తగ్గట్టుగానే ప్రొద్దున్న టిఫినుకి నూకలన్నం చేసారు. నూకలన్నం తో పాటు తరిగిన బెల్లం, వెన్న పూస, ఆవకాయ కూడా రెడీ అయ్యాయి. తీరికగా కూర్చుని ఒక పెద్ద గిన్నెడు నూకలన్నం ఖాళీ చేసాను.