శుభలేఖ నుండి సుబలేక వరకూ…

20 Dec

నేను చిరంజీవి నటనాభిమానిని. తన సినిమాలలో కొన్ని పాటలు తెలుగు సినీప్రపంచపు ఆణిముత్యాలని నా అభిప్రాయం. నాకు నచ్చిన కొన్ని: చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు), అందాలలో (జగదేకవీరుడు అతిలోకసుందరి), శుభలేఖ వ్రాసుకొన్నా (కొండవీటి దొంగ), అరె ఏమైందీ (ఆరాధన), నమ్మకు నమ్మకు (రుద్రవీణ), చిరంజీవి-విశ్వనాధ్ సినిమాలలోని చాలా పాటలు (శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు), ఇంకా చాలా.
ఈ వారం కొత్త శుభలేఖ (గాయకుని ప్రకారం సుబలేక) పాట వినే భాగ్యం (?) కలిగింది. ఒకే పదాన్ని ఒకే పాటలో నాలుగురకాలుగా పలకొచ్చని (ఖూనీ చేయవచ్చని) నిరూపించినవారికి కృతజ్ఞతలు. కొత్త తరం శ్రోతలను అలరించే ప్రయత్నంలో పాటలో పదాలను కొంచెం స్పీడుగా లాగించారు. అంతకుమించి ఈ పాటలో అదనపు ఆకర్షణలు ఏమీ లేవు. పాట మధ్యలో వచ్చిన మేక్ సమ్ నోయిస్ (Make some noise) అన్న అరుపు ఎందుకో చాలా సందర్భోచితంగా అనిపించింది. ఈ కొత్త పాట కేవలం సంగీతం లేని శబ్దాలు మాత్రమే. (No music, only noise!)

One thought on “శుభలేఖ నుండి సుబలేక వరకూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.