శ్రావణ శుక్రవారం

31 Jul

శ్రావణ శుక్రవారం ప్రొద్దున్నే ఇంట్లో పూజ జరిగింది. తలస్నానం చేసి, ఆఫీసుకి రెడీ అయిన తరువాత సుష్టుగా ప్రసాదాలు తిన్నాను. పులిహోర, క్షీరాన్నం మరియు గారెలు తిన్న తరువాత కారెక్కుతూండగా వివిధభారతి వారి పండగ ప్రసారాలు గుర్తుకి వచ్చాయి. రేడియోలో పండగ ప్రసారాల సంబరం తగ్గింది అనుకుంటూ రేడియో పాటలు వింటున్నాను. ఈలోగా రేడియో జాకీ శ్రావణ శుక్రవారం గురించి, లక్ష్మీ దేవి కటాక్షం గురించి ఊదరగొట్టేసాడు. జనసామాన్యంలో పెరిగిన భక్తికి ముగ్ధుడనై ఉండగా వాడు శ్రోతలందరికీ రిసెషన్ ఎఫెక్టు తగ్గాలని ప్రార్ధించాడు. అపుడర్ధమయింది – అసలు విషయం.

మీకు తెలుసా?

03 Jul

సుమారు ఇరవై సంవత్సరాల క్రితం రేడియోలో విన్న తెలుగు పాట ఇది. ఏ సినిమాలోదో తెలియదు.  కేవలం రెండు మూడు సార్లు మాత్రమే విన్నప్పటికీ ఈ పాట బాగా గుర్తు ఉండిపోయింది.  ఈ పాట ఏ సినిమాలోదో మీకు తెలిస్తే దయచేసి నాకు తెలియచేయండి.

“అన్నీ ఉన్నా ఏమీ లేనీ అమాయకుడిని, నేనందరి దేవుడిని.
కోరికలున్నా, తీరే దారులు ఉన్నా, మాటకు బందీని!….
….
నిప్పులాంటి వాడిననీ గొప్ప చెప్పుకున్నానూ, నిప్పులో నిప్పునై కాలిపోతున్నాను.
….”

మొగల్తూరు – 2

26 Apr

క్రితం సారి మొగల్తూరుకి అర్ధశతాబ్దం పూర్వమే పేరు తెచ్చిన ఒకాయన గురించి వ్రాసాను. తెలుగు సాహిత్యం లో ప్రవేశం ఉన్నవారికి ఆయనెవరో తెలిసే ఉంటుంది. ఆయన పేరు బారిస్టరు పార్వతీశం. నరసింహ శాస్త్రి గారి మానస పుత్రుడాయన. సినిమాలు రాకముందరి పుస్తకాల కాలం నాటివాడు కాబట్టి ఆయనను మన ఇంజిను డ్రయివరుగారంతలా జనాలు గుర్తుంచుకోలేదు. పైగా నక్కబావ, పులితమ్ముడు వంటివారి తోడు లేదు కాబట్టి ఆయనకు రావలిసినంత గుర్తింపు రాలేదని నా స్వంత అభిప్రాయం. మీరేమంటారు?

మొగల్తూరు

05 Apr

ఒక రైలుంది. ఆ రైలుకో ఇంజినుంది. ఆ ఇంజినుకో డ్రైవరున్నాడు. ఆ డ్రైవరుగారిది మొగల్తూరు. సైకిలు వాళ్ళూ, కారు వాళ్ళూ, ముఖ్యంగా  చేతి పనులవాళ్ళూ ఆ డ్రైవరుగారిని మొగల్తూరుకి ఏమీ చేయలేదని విమర్శించారు. దాంతో ఆ డ్రైవరుగారికి కోపం వచ్చింది. మొగల్తూరుకి నేను ఏం చేయకపోవటం ఏమిటి? నేను మొగల్తూరుకి ప్రపంచంలోనే పెద్ద గుర్తింపు తీసుకువచ్చాను అన్నారు.

అది చదవగానే నాకు ఇంకొక మొగల్తూరాయన గుర్తుకొచ్చాడు. అర్ధ శతాబ్దానికి పూర్వమే మొగల్తూరుకి ఖండాంతర ఖ్యాతి తీసుకువచ్చినవాడు ఆయన. రైలు (ఈ ఎన్నికల రైలు కాదు) ఎక్కాడు. స్టీమరెక్కాడు. ఇంగ్లాండు వెళ్ళాడు. పెద్ద చదువులు చదివాడు. గోల్ఫు ఆటలో అక్కడివారినే ఖంగు తినిపించాడు. అప్పటికి కంప్యూటర్లు లేవు కాబట్టి సాఫ్టువేరు చదవ(?)లేదు కానీ ఇప్పటివాళ్ళు అతనికన్నా పెద్ద పోటుగాళ్ళేంకాదు. ఆయనగురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే మాత్రం తప్పక తెలుసుకోండి. తెలుగువారు గర్వపడదగ్గ గడుసువాడాయన. ఆయన గురించి మరిన్ని వివరాలతో ఇంకొక బ్లాగు పోస్టు వ్రాస్తాను. నమస్కారం.

నిన్నొదల, బొమ్మాళీ!

05 Apr

“నిన్నొదల, బొమ్మాళీ!”
అరుంధతి సినిమా చూసినవాళ్ళు మర్చిపోలేని భీభత్స ప్రధానమయిన డైలాగు ఇది. ఇక్కడ భీభత్సం అంటే టెర్రరిస్టులూ, ఫ్యాక్షనిస్టులూ సృష్టించేది కాదు. కావ్యాత్మకమైన భీభత్సం అని అర్ధం.
ఇవే “నిన్నొదల, బొమ్మాళీ!” పదాలతో à°’à°• డ్యుయెట్ వింటే ఎలా ఉంటుంది? బిల్లా సినిమా పాటలు విన్నప్పుదు à°ˆ పాట చాలా నవ్వు పుట్టించింది.

కుర్సగా ఏసెయ్‌మంటారా?

24 Jan

శనివారం మధ్యాహ్నం. సూర్య ను హెయిర్ కట్ కి తీసుకుని వెళ్ళాను. ఎప్పుడూ వెళ్ళే షాపే. కానీ కొత్త కుర్రాడు. మేం వెయిట్ చేస్తుండగా నా భాష విన్నట్లున్నాడు. సూర్యను కూర్చోబెట్టి నా వంక తిరిగాడు.
“కుర్సగా ఏసెయ్‌మంటారా?”
“వురేయ్! ఏ వూర్రా మీది?”
“భీమవరం సార్.”
ఏంటో! ఆల్రోడ్స్ లీడ్ టు …

Telugu Tongue Twister

06 Jan

ఈ మధ్య నేను విన్నది:
లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు, ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా?

కొంచెం నా స్వంత కవిత్వం కలిపిన తరువాత:
లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్య కుక్షికి, ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా?

My First Telugu Post

02 Jan

తెలుగు పాఠకులకు మా బ్లాగు తరఫున నమస్కారం. ఈ సంవత్సరం నుండి కనీసం కొన్ని బ్లాగు పోస్టులు అయినా తెలుగు లో వ్రాయాలని అనుకొంటున్నాను. మీ అభిప్రాయాలు తెలుపండి.